Pawan Kalyan | రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ప్రస్తుతం సినిమాలు, రాజకీయాల్లో సమాంతరంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వేగంగా పరుగులు పెడుతున్నారు. కానీ ఈ వేగమే ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందన్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. తాజాగా విడుదలైన ‘ఓజీ’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వర్షంలో తడిసిన పవన్ కళ్యాణ్… అప్పటి నుంచి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే సినిమా ప్రమోషన్స్, ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంపై పలు ఊహాగానాలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇలాగే ఆయన వైరల్ ఫీవర్‌కి గురయ్యారు.
పవన్ కళ్యాణ్ గతంలో కమిటైన ‘హరిహర వీరమల్లు’ సినిమాను పూర్తిచేసి విడుదల చేశారు. అదే సమయంలో ‘ఓజీ’ సినిమాను పూర్తిచేసి సెప్టెంబర్‌లో రిలీజ్ చేశారు. అభిమానులకు ఫుల్ మాస్ ఫీస్ట్‌గా మిగిలిన ఈ మూవీకి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం సెట్స్‌పై ఉంది. ఈ సినిమాతో తాత్కాలికంగా సినిమాలకు విరామం ఇవ్వాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. జనసేన పార్టీ అధ్యక్షుడిగా గతంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనలో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రజల సమస్యలపై అపారమైన శ్రద్ధ, వ్యవస్థలపై పట్టు సాధించేందుకు రోజుకి 18 గంటలపాటు పని చేస్తున్నారట. ఈ కారణం వలన ఆయనకు శారీరకంగా కొంత ఒత్తిడి ఏర్పడుతోంది.
తన డెడికేషన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయినా, ఆయన ఆరోగ్యంపై మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేసినా, ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం ముఖ్యం అన్నది పవన్ కళ్యాణ్‌కు మరింతగా గుర్తు చేయాలి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తున్నారు.ఇక ఫ్యూచర్ ప్లాన్ చూస్తే.. సినీ ప్రాజెక్టులు పూర్తిచేయగానే, పవన్ రాజకీయాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. “ప్రజల శ్రేయస్సే ప్రధానం, సినిమాలు తర్వాత” అన్న అభిప్రాయంతో ఆయన ముందుకు సాగుతున్నారు.సినిమాల్లో స్టార్ హీరోగా, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా రెండు రంగాల్లోనూ పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే, అభిమానుల అభిమానం, ప్రజల ఆశలన్నీ నెరవేర్చాలంటే ఆరోగ్యంగా ఉండడం అత్యవసరం. సినిమా, పాలిటిక్స్ రెండింటినీ సమర్థవంతంగా నడిపించడంలోనూ విశ్రాంతి, ఆరోగ్యం కూడా ఇన్నర్ పార్ట్ కావాల్సిందే.