Pawan Kalyan | ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ దళపతి విజయ్ టీవీకే పార్టీని స్థాపించి త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడని తెలిసిందే. అయితే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, అసెంబ్లీ ఎన్నికల పోటీ చేయడంపై విజయ్‌కు ఏమైనా సలహానిస్తారా అని మీడియాతో చిట్‌చాట్‌లో అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఎవరికైనా సలహా ఇవ్వడాన్ని తాను అంతగా విశ్వసించనని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీ వ్యక్తి తన సొంత నిర్ణయంతో సొంత మార్గాన్ని తానే ఏర్పరచుకుంటాడరి స్పష్టం చేశారు. అంతేకాదు విజయ్‌కున్న స్టార్డమ్, రాజకీయారంగేట్రంపై పాజిటివ్‌గా స్పందించాడు. విజయ్‌కు సలహా అవసరం లేదన్నారు పవన్ కల్యాణ్. ప్రభావవంతమైన వ్యక్తులు తాము పోషించే పాత్రతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడం ఎల్లప్పుడూ ప్రశంసనీయదగ్గ విషయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
తాజా వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ఎలాంటి సలహాలు ఇవ్వకుండా చాలా బ్యాలెన్సింగ్‌గా కామెంట్స్ చేస్తూ ప్రోత్సహాన్ని అందించడమే కాకుండా ప్రజా సేవలో ఉన్న ఇద్దరు టాప్ స్టార్ల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!