బుదాపెస్ట్: హంగేరి(Hungary) విపక్ష నేత పీటర్ మాగ్యార్.. స్టన్నింగ్ విక్టరీ కొట్టారు. పార్లమెంటరీ ఎన్నికల్లో మాగ్యార్‌కు చెందిన టిజా పార్టీ అనూహ విజయాన్ని సాధించింది. 16 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న విక్టర్ ఓర్బాన్ షాకింగ్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మాగ్యార్‌కు ఫోన్ చేసిన ఓర్బాన్.. విక్టరీ విషెస్ తెలిపారు. ఆదివారం రాత్రి వరకు 98 శాతం ఓట్లను లెక్కించారు. దాంట్లో టిజా పార్టీకి 53.72 శాతం ఓట్లు పోలయ్యాయి. ఫిడేజ్ పార్టీకి 37.67 శాతం ఓట్లు పడ్డాయి.
అవినీతిని అంతం చేస్తానని మాగ్యార్ ఎన్నిలక ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వ్యవస్థలకు ఫండింగ్ పెంచనున్నట్లు చెప్పారు. యురోపియన్ యూనియన్‌తో బంధాలను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. హంగేరి ఎన్నికల చరిత్రలోనే తొలి సారి అత్యధికంగా ఓటింగ్ నమోదు అయ్యింది. సుమారు 77.8 శాతం మంది ఓట్లు వేశారు. విక్టరీ తర్వాత దనూబ్ నది వద్ద మద్దతుదారులను ఉద్దేశించి పీటర్ ప్రసంగించారు. మనం సాధించామన్నారు. కలిసికట్టుగా హంగేరి ప్రభుత్వాన్ని కూల్చేశామన్నారు.
తాజా లెక్కల ప్రకారం టిజా పార్టీకి 138 సీట్లు రానున్నాయి. ఇక ఓర్బాన్ పార్టీకి 55 సీట్లు మాత్రమే దక్కనున్నాయి. హంగేరి ప్రధానిగా ఎన్నికైన పీటర్ మాగ్యార్, టిజా పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. హంగేరితో చరిత్రాత్మక బంధం ఉందన్నారు. మునుముందు ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం కావాలన్నారు.
Teljes szívemből gratulálok Magyar Péter úrnak és a Tisza pártnak az átütő választási győzelemért. India és Magyarország egy mély gyökerekkel, közös értékekkel és tartós tisztelettel övezett barátságot ápol. Várom a közös munkát, melyben tovább erősítjük a kétoldalú…
— Narendra Modi (@narendramodi) April 13, 2026