టాలీవుడ్ సినీజనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు ’హరి హర వీరమల్లు’ . పవన్‌కల్యాణ్ 27వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింఫ్స్ ను మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ బిల్డింగ్ పై నుంచి నౌకవైపు జంప్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్న సీన్ రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంది.
17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టును ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి బ్యాక్ డ్రాప్లో చార్మినార్ సెట్ ను వేయగా.. సైరా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఛార్మినార్ స్పెషల్ సెట్ కోసం పనిచేస్తున్నాడు. పవన్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నాడని టాక్. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు పవన్-క్రిష్ సినిమా. ఫస్ట్ లుక్ గ్లింఫ్స్ ను మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు @PawanKalyan AS #HariHaraVeeraMallu @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRatnamOfl @ADayakarRao2 @megasuryaprod @venupro pic.twitter.com/UI82ar6vWp— Namasthe Telangana (@ntdailyonline) March 11, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.