TTD | గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

తిరుమల : తిరుపతి గోవిందరాజ స్వామి పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం జరిగింది.
ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు, బాలాలయంలోని స్వామివారి మూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, శ్రీమఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చినజీయర్ స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ రాజేంద్రుడు, ఆలయ ప్రధానార్చకులు పీ శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఏఈవో రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ కామరాజు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

