Bollywood Movie | బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ డ్రామా ‘పతి పత్ని ఔర్ వో దో’ (Pati Patni Aur Woh Do). ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. 2019లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘పతి పత్ని ఔర్ వో’కి ఇది సీక్వెల్. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ‘ప్రజాపతి పాండే’ అనే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఒక స్నేహితురాలికి సహాయం చేయబోయి, తన జీవితాన్ని ఎంతలా గందరగోళంలో నెట్టుకున్నాడో అనేది ఈ సినిమా కథాంశం. ఈసారి ఒకరు కాదు, ఏకంగా ముగ్గురు భామలతో ప్రజాపతి పాండే పాట్లు పడుతున్నారు. సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, మరియు వామికా గబ్బి ముగ్గురూ తమ నటనతో అలరించబోతున్నారు. ఈ సినిమాలో ఆయుష్మాన్తో పాటు విజయ్ రాజ్, తిగ్మాన్షు ధులియా, అయేషా రజా వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.