Judge died | ఢిల్లీలో యువ న్యాయమూర్తి అనుమానాస్పద మృతి
Judge died | దేశ రాజధాని ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 30 ఏళ్ల యువ న్యాయమూర్తి (Judge) అమన్ కుమార్ శర్మ (Aman Kumar Sharma) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దక్షిణ ఢిల్లీ (South Delhi) పార్క్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో శనివారం ఆయన ఉరేసుకుని కనిపించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Judge died : దేశ రాజధాని ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 30 ఏళ్ల యువ న్యాయమూర్తి (Judge) అమన్ కుమార్ శర్మ (Aman Kumar Sharma) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దక్షిణ ఢిల్లీ (South Delhi) పార్క్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో శనివారం ఆయన ఉరేసుకుని కనిపించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో అమన్ బావమరిది శివమ్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా అమన్ కుమార్ శర్మ ఉరేసుకుని కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ కలహాల కారణంగానే అమన్ తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆయన తండ్రి, ఇతర బంధువులు పోలీసుల వద్ద ఆరోపించినట్లు సమాచారం. అయితే ఘనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
అమన్ కుమార్ శర్మ 2021లో ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో చేరారు. ప్రస్తుతం కర్కర్దూమా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య కూడా జడ్జి కావడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

