కాన్బెర్రా: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఓ మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపడాన్న ఆరోపణల నేపథ్యంలో టిమ్ పైన్ గతవారం టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కమిన్స్‌ను జట్టు నాయకుడిగా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్‌ను స్టీవ్ స్మిత్‌ను వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.
దీంతో ఆస్ట్రేలియా పురుషుల టెస్ట్ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్న మొదటి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అదేవిధంగా రిచీ బెనౌడ్ తర్వాత ఏ జట్టుకైనా కెప్టెన్సీ వహించనున్న తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. మొత్తంగా ఆసిస్ జట్టుకు కమిన్స్.. 47వ కెప్టెన్ కావడం విశేషం. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.
కాగా, ప్రతిష్ఠాత్మక యాషెస్‌కు ముందు జట్టు నాయకత్వ బాధ్యలు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని కమిన్స్ చెప్పాడు. పైన్లానే తాను కూడా జట్టు నాయకుడిగా ఉంటానని తెలిపాడు.
The 47th captain of the Australian men's Test cricket team! @patcummins30 🇦🇺 pic.twitter.com/bM4QefTATt
— Cricket Australia (@CricketAus) November 26, 2021