TGSRTC : రాఖీ పండుగ వేళ ఆర్టీసీ బస్సుల్లో చార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాఖీ స్పెషల్’ పేరుతో సర్వీసులు నడపడం సంతోషకరమే అయినా.. అడ్డగోలుగా చార్జీల పెంచడం దారుణమని జనం వాపోతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నానికే ఛార్జీపై రూ.20 అధికంగా వసూలు చేయడాన్ని ప్రయాణికులు తప్పుపడుతున్నారు. నాగర్కర్నూల్–మహబూబ్నగర్ పల్లె వెలుగు బస్సులో అకస్మాత్తుగా చార్జీల పెంపు అందుకు నిదర్శనం.
రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులను దోపిడీ చేస్తోంది ఆర్టీసీ. స్పెషల్ సర్వీస్లు ఏమోగానీ.. గంటల వ్యవధిలో ఛార్జిల పెంపుతో ఇదెక్కడి అన్యాయం అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్కర్నూల్–మహబూబ్నగర్ పల్లె వెలుగు బస్సులో శుక్రవారం ఉదయం రూ.60 ఉన్న చార్జీ.. మధ్యాహ్నానికి రూ.80కి పెంచారు. ముందస్తు సమాచారం లేకుండా పండుగ రోజున చార్జీలు పెంచడంపై ప్రయాణికుల మండిపడ్డారు.
మరోవైపు టికెట్ ధర రూ.60 అనుకొని బస్సెక్కిన హాస్టల్ విద్యార్థులు చార్జీలు సరిపోక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది విద్యార్థులు అదనపు రూ.20 చెల్లించలేక మార్గమధ్యలోనే బస్సు దిగి నడుచుకుంటూ వెళ్లారు. ‘పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారం’టూ ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యంపై మండిపడ్డారు. చార్జీల పెంపుపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్యానికే రూ.20 పెంచడంపై నాగర్కర్నూల్ డిపోపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల డిమాండ్ చేశారు.
ఉదయం రూ.60 మధ్యాహ్నానికి రూ.80
రాఖీ వేళ ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం
నాగర్కర్నూల్–మహబూబ్నగర్ పల్లె వెలుగు బస్సులో అకస్మాత్తుగా చార్జీల పెంపు
ఉదయం రూ.60 ఉన్న చార్జీ.. మధ్యాహ్నానికి రూ.80కి పెంపు
ముందస్తు సమాచారం లేకుండా పండుగ రోజున చార్జీలు పెంచడంపై ప్రయాణికుల… https://t.co/FEsc9ikpY3 pic.twitter.com/OJs1nb92Ow
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026