Minister Ponnam Prabhakar : తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)కు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అధికారులు నోటీసులు ఇచ్చారు. సర్ ఫామ్‌లో మంత్రి తండ్రి పేరు తప్పుగా పడడంతో బీఎల్వో ఆయనకు నోటీసులు పంపారు. ఓటరు జాబితాలో తండ్రి పేరు సవరణకు తగిన పత్రాలను సమర్పించాలని బీఎల్వో కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శుక్రవారం ‘సర్’ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఓటరు జాబితాలో మంత్రి తండ్రి పేరు తప్పుగా పడినందున సవరణకు అవసరమైన పత్రాలు సమర్పించాలని బీఎల్వో ఆ నోటీసుల్లో తెలిపారు అనంతరం.. మంత్రి తన తండ్రి పేరు సవరణకు అవసరమైన పత్రాలను అందజేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే అయిన పొన్నం ప్రభాకర్ తండ్రి పేరు పొన్నం సత్తయ్య గౌడ్. ఆయనను పొన్నం సత్తయ్య అని కూడా పిలిచేవారు.
మంత్రి పొన్నంకు నోటీసులు ఇచ్చిన SIR అధికారులు
పొన్నం ప్రభాకర్ తండ్రి పేరు తప్పుగా పడడంతో నోటీసులు ఇచ్చిన బీఎల్వో
తండ్రి పేరు సవరణకు తగిన పత్రాలను బీఎల్వోకు అందజేసిన పొన్నం ప్రభాకర్ pic.twitter.com/hPWFm8Dnwt
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026