ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు
ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు | ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఈ నెల 18న శుక్రవారం తన ఎదుట హాజరు కావాలని మంగళవారం ఆదేశించింది.

న్యూఢిల్లీ : ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్యానెల్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కమిటీ డిజిటల్ వేదికలపై పౌరుల హక్కుల పరిరక్షణ, మహిళల భద్రత, ఆన్లైన్ వార్తలు దుర్వినియోగం కాకుండా తీసుకునే చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది.
ఈ విషయమై కేంద్రం ఇటీవల ట్విట్టర్‌కు చివరి నోటీసు ఇచ్చింది. కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నుంచి పదే పదే లేఖలు రాసినా.. ట్విట్టర్ నుంచి సరైన స్పందన రాలేదు. అయితే కొత్త ఐటీ రూల్స్ ను తాము పాటిస్తామని గత వారంలో ట్విట్టర్ హామీ ఇచ్చింది. భారత్‌తో తాము నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాలను పాటించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా చేయలేకపోయామని పేర్కొన్నారు.
చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియామకాన్ని పూర్తి చేసే దశలో ఉన్నామని, రాబోయే రోజుల్లో అదనపు వివరాలు అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు ఈ నెల 7న ఐటీ మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో ట్విట్టర్ పేర్కొంది. ఈ క్రమంలో కొత్త ఐటీ నిబంధనలను పాటించడానికి ట్విట్టర్‌కు ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని పార్లమెంటరీ కమిటీ ప్రకటించింది. దేశం రూపొందించిన నిబంధనలను అనుసరించడానికి ట్విట్టర్‌కు ఏ పరిమితులు అడ్డంకిగా ఉన్నాయో తాము తెలుసుకోవాలనుకొంటున్నామని పార్లమెంటరీ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
దేశంలో 60వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

