IND vs AFG : అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ 8తొలి పోరులో భారత బ్యాటర్లు దంచుతున్నారు. స్లో పిచ్పైస్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(17), రిషభ్ పంత్(19)లు బౌండరీలతో హోరెత్తిస్తున్నారు. నబీ వేసిన ఆరో ఓవర్లో పంత్ ఏకంగా హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. దాంతో, పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన టీమిండియాకు ఆదిలోనే షాక్. కెప్టెన్ రోహిత్ శర్మ(8) స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడు. దాంతో, 11 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది. ఫజల్ హక్ ఫారూఖీ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి ఎల్బీగా బతికిపోయిన రోహిత్.. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయాడు.
Fazalhaq Farooqi continues to deliver in this tournament, Rohit falls #AFGvIND #T20WorldCup
👉 https://t.co/gf52x20kRh pic.twitter.com/MVWg2RkHIm
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2024
కానీ, బంతి 30 అడుగుల వలయంలోనే గాల్లోకి లేచింది. దాంతో, అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సులువైన క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పంత్ అండగా.. కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నాడు.