Gold Fish | ఓ మత్స్యకారుడు సముద్రంలో చేపల వేలకు వెళ్లాడు. అలా వెళ్లిన సదరు మత్స్య కారుడికి లక్ కలిసొచ్చింది. అంతే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచీ తీర ప్రాంత ఇబ్రహీం హైదరీ గ్రామ వాసి హజీ బలోచ్ అనే వ్యక్తి సముద్రంలో చేపలు పడుతూ జీవిస్తున్నాడు. గత సోమవారం రాత్రి తన సహచర మత్స్యకారులతో కలిసి అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు.
కొద్దిసేపటికే అరుదైన గోల్డ్ ఫిష్లుగా భావించే సోవా (Sowa) చేపలు అతని వలకు చిక్కాయి. శుక్రవారం కరాచీ హార్బర్లో వేలం వేస్తే ఏడు కోట్ల పాకిస్థాన్ రూపయాలకు అమ్ముడయ్యాయి. ఒక్కో చేప గరిష్టంగా రూ.కోటి (పాకిస్థాన్ కోటి రూపయాలు)కి అమ్ముడయ్యాయని పాకిస్థాన్ ఫిషర్ మెన్ ఫోర్ అధ్యక్షుడు ముబారక్ ఖాన్ చెప్పారు.
అరుదుగా లభించే సోవా చేపల పొట్ట నుంచి సేకరించే స్రవాలతో ఔషధాలు తయారు చేస్తారు. వీటి నుంచి తీసే సన్నటి దారం వంటి పదార్థం సర్జరీలో వాడతారు. దీంతో ఈ చేపలకు చాలా గిరాకీ ఉంటుంది. ఒక్కో చేప 20-40 కిలోల బరువు ఉండటంతోపాటు 1.5 మీటర్ల పొడవు పెరుగుతాయి. తూర్పు ఆసియా దేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. సముద్రం లోపలే ఉండే ఈ చేపలు గుడ్లు పెట్టే సమయానికి తీరానికి వస్తాయి.