పొడవాటి జుట్టున్న పాకిస్తాన్ కళాకారుడు అరెస్ట్
పాకిస్తాన్‌కు చెందిన కళాకారుడు అబూజర్ మధును ఇటీవల లాహోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున రిక్షా కోసం ఎదురుచూస్తుండగా అబూజర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు

లాహోర్: పాకిస్తాన్‌కు చెందిన కళాకారుడు అబూజర్ మధును ఇటీవల లాహోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున రిక్షా కోసం ఎదురుచూస్తుండగా అబూజర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అయితే, ఆయన డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆయన కళాకారుడనే విషయం తెలుసుకుని వదిలిపెట్టేశారు.
కళాకారుడు అబూజర్ మధును అరెస్ట్ చేయడం వెనుక కారణం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే, అతడి పొడవాటి జుట్టు అధికారులను ఇబ్బందుల్లో పడేసింది. రిక్షా కోసం ఎదురుచూస్తున్న అబూజర్ చూపులు అనుమానాస్పదంగా ఉండటంతో విచారించేందుకు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతడి బ్యాగులు, వస్తువులు కూడా ప్రమాదకరమైన రీతిలో ఉండటంతో పోలీసులు అనుమానించాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఉన్న సెల్లో ఉన్న మధు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానికుడైన అలియా హైదర్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పేర్కొన్నాడు. “ఆర్టిస్ట్, పెర్ఫార్మర్ అబూజర్ మధును రాత్రివేళ లాహోర్ వీధుల్లో నడుస్తున్నందున నిన్న రాత్రి అరెస్టు చేశారు. అతడిని అనుమానించారు. అతడి బ్యాగులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సెల్లో వేశారు అని ట్వీట్ చేయడంతో విషయం గుప్పుమన్నది. పోలీసుల తీరును నెటిజెన్లు తీవ్రంగా విమర్శించారు.

తాము అరెస్ట్ చేసింది ఓ కళాకారుడినన్న విషయం గుర్తించిన పోలీసులు వెంటనే అతడ్ని విడిచిపెట్టారు. పొడవాటి జుట్టుతో విచిత్ర వేషధారణతో అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లామని, డాక్యుమెంట్లు పరిశీలించి ఆయన ఓ కళాకారుడు అని తెలుసుకుని వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్‌తో 168 ఎలుకలు
కెఫిన్ అధిక వినియోగంతో గ్లకోమా సమస్య
కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ : ఆంటోనియా గుటెర్రెస్
తొలి ప్రవేశం : భద్రతా మండలిలో అల్బేనియాకు తాత్కాలిక సభ్యత్వం
చర్చలు షురూ: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
రాజకీయ రంగు : త్వరలో బ్రాహ్మణేతర పూజరుల నియామకం
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

