అక్కడ టీచర్లు జీన్స్, టీ షర్టులు ధరించడంపై నిషేధం
టీచర్లు | ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదు. ఇక మహిళా టీచర్లంటారా.. జీన్స్ లేదా శరీరానికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులు అసలే వేసుకోవద్దు. నీట్‌గా గడ్డం చేసుకోవాలి. కటింగ్ మచింగా ఉండాలి.

ఇస్లామాబాద్: ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదు. ఇక మహిళా టీచర్లంటారా.. జీన్స్ లేదా శరీరానికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులు అసలే వేసుకోవద్దు. నీట్‌గా గడ్డం చేసుకోవాలి. కటింగ్ మచింగా ఉండాలి. గోర్లు కట్ చేసుకోవడంతోపాటు పర్ఫ్యూమ్ వేసుకునే స్కూలు లేదా కాలేజీకి రావాలి. ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఇదంతా ఎక్కడనుకుంటున్నారు.. మన పొరుగుదేశం పాకిస్థాన్‌లో..
మహిళా ఉపాధ్యాయులు టీన్స్, బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోకూడదని పాకిస్థాన్ ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (FDE) ఆదేశాలు జారీచేసింది. ఇది పురుష ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందని, జీన్స్, టీ షర్టులు ధరించకూడదని స్పష్టం చేసింది. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న పురుషులు ప్యాంట్, షర్టులు ధరించాలని, మహిళా టీచర్లు షల్వార్ కమీజ్ ధరించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి స్కూళ్లు, కాలేజీల ప్రిన్సిపల్స్‌కు విద్యాశాఖ డైరెక్టర్ ఒక లేఖ పంపించారు.
ఉపాధ్యాయులు రెగ్యులర్ హెయిర్‌కట్ చేయడం, గడ్డం ట్రిమ్ చేయడం, నెయిల్ కటింగ్, స్నానం, డియోడరెంట్ లేదా పెర్ఫ్యూమ్ ఉపయోగించడం వంటివి పాటించాలని సూచించింది. అదేవిధంగా క్లాస్రూమ్, ల్యాబ్‌లో ఉన్నప్పుడు టీచింగ్ సిబ్బంది అందరూ టీచింగ్ గౌన్లు ధరించాలని పేర్కొన్నారు. గేట్కీపర్లు, సహాయక సిబ్బంది తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని నిర్దేశించింది.
మహిళా ఉపాధ్యాయులు హుందాగా కనిపించేలా షల్వార్ కమీజ్, ట్రౌజర్లు, స్కార్ఫ్ లేదా హిజాబ్‌తో షర్ట్ వేసుకోవచ్చని అందులో పేర్కొన్నది. ఇక పురుష టీచర్లు ప్యాంటు, టైతో షర్టు ధరించడం తప్పనిసరని పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

