వారణాసి : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘పద్మశ్రీ’ బాబా శివానంద్ శనివారం రాత్రి పరమపదించారు. ఆయన వయసు 128 సంవత్సరాలని ఆయన శిష్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను గత నెల 30న బీహెచ్‌యూ దవాఖానలో చేర్పించారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, యోగా, బాబా శివానంద్ జీవితం ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. బాబా శివానంద్‌కు మోక్షం ఇవ్వాలని కాశీ విశ్వనాథుడిని ప్రార్థిస్తున్నానని యూపీ సీఎం యోగి తెలిపారు.