మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
మురాసు తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు పెన్పహాడ్ మండల వ్యాప్తంగా వరి చేలు నేలకొరిగాయి. అర్నబ్ తుఫాన్ దెబ్బ నుండి కోలుకోకముందే ఇప్పుడు మరో తుఫాన్ మురాసు ప్రభావం వల్ల మంగళవారం కురిసిన వర్షం, గాలులకు చేతికొచ్చిన పంట పొలాలకు నేల వాలాయి.
పెన్పహాడ్, నవంబర్ 03 : మురాసు తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు పెన్పహాడ్ మండల వ్యాప్తంగా వరి చేలు నేలకొరిగాయి. అర్నబ్ తుఫాన్ దెబ్బ నుండి కోలుకోకముందే ఇప్పుడు మరో తుఫాన్ మురాసు ప్రభావం వల్ల మంగళవారం కురిసిన వర్షం, గాలులకు చేతికొచ్చిన పంట పొలాలకు నేల వాలాయి. అన్నదాతలు సాగునీటి కష్టాలు ఎదుర్కొని మండల వ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాలలో వరి పండించారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ దశలో వరుస తుఫాన్లు రైతులను కలవరపెడుతున్నాయి. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు ముంపునకు గురై దెబ్బతిన్నాయి. ఇప్పుడు మురాసు తుఫాన్ వచ్చి నిండా రైతులను ఆగం చేసినవి. పెన్పహాడ్ గ్రామానికి చెందిన కౌలు రైతు బంటు కృష్ణ సాగు చేసిన 8 ఎకరాల వరి పంట గాలుల ధాటికి పూర్తిగా నేలవాలింది.
పంట చేతికొచ్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు పంట నేలకొరగడంతో ఆర్థికంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కష్టపడి సాగు చేసిన పంట గాలుల ప్రభావంతో దెబ్బతినడంతో పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరువు మండలంగా ప్రకటించిన పెన్పహాడ్ మండలంలో తుఫాన్ ప్రభావం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినడం రైతులకు తీవ్ర భారంగా మారింది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

