CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాలపై ప్రముఖ చలనచిత్ర దర్శకుడు హనీ టెహ్రాన్ తీవ్రంగా మండిపడ్డారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల జారీ చేసిన కొత్త మార్గదర్శకాలపై ప్రముఖ చలనచిత్ర దర్శకుడు హనీ ట్రేహన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కొత్త నిబంధనలు దేశంలో భావప్రకటన స్వేచ్ఛను అణచివేసేలా, పిరికిపందతనం, నియంతృత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. దిల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన చారిత్రక క్రైమ్ డ్రామా ‘సట్లూజ్’ చిత్రం ఓటీటీలో విడుదలైన కొద్ది రోజులకే తొలగించబడిన వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సర్టిఫికేషన్ కోసం చాలా సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడింది. ఎట్టకేలకు జీ5 ఓటీటీలో ‘సట్లూజ్’ పేరుతో జూలైలో విడుదలైనప్పటికీ, జాతీయ భద్రతా కారణాలరీత్యా కొద్ది రోజుల్లోనే దీన్ని ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించారు. ఈ పరిణామాల నడుమ తాజాగా సీబీఎఫ్సీ ఐదు కొత్త నిబంధనలతో కూడిన అడ్వైజరీని విడుదల చేయడం కలకలం రేపింది. తొమ్మిదేళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరించిన ఈ నూతన సెన్సార్ బోర్డుకు శశి శేఖర్ వేంపతి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. ఇందులో ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై సర్టిఫికేషన్‌కు సమర్పించే చిత్రాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని, ముందుగా ప్రకటించిన విడుదల తేదీలు, ప్రచార టైటిల్స్‌కు ఎలాంటి కట్టుబాట్లు ఉండవని బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా సినిమాల పేర్లు కూడా కఠిన పరిశీలనకు లోబడి ఉంటాయని, కమిటీ వాటిని మార్చే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, నవంబర్ 20న విడుదల కానున్న సన్నీ డియోల్ చిత్రం ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ టీజర్‌పై ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్యులను అవినీతిపరులుగా, తప్పుగా చూపించేలా ఈ టీజర్ ఉందని, ఇది వైద్యులపై దాడులకు దారితీసేలా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు, తదుపరి విచారణను నవంబర్ 16కి వాయిదా వేసింది.

Satluj
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

