జడ్చర్లటౌన్, డిసెంబర్ 27 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన పీ ధనుష్ (18) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. కావేరమ్మపేట వార్డు మాజీ సభ్యుడు సుధాకాశీవిశ్వనాథ్ కుమారుడు ధనుష్ హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి కళాశాలలో స్పెషల్ స్టడీస్‌కు వెళ్లిన ధనుష్ అకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడున్న వారు గమనించి దవాఖానకు తరలించేలోగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్టు నిర్ధారించారు. ధనుష్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శనివారం కళాశాలకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. కుమారుడి కండ్లు మరొకరికి ఉపయోగపడ్తాయని భావించి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు దానంచేశారు.