
కొత్తపల్లి, నవంబర్ 21: అఖిల భారత ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ 536 పాయింట్లతో టాప్లో నిలువగా.. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) జాతీయ ప్రధాన కార్యదర్శి రజనీష్ చౌదరి, సీఎస్కేఐ చైర్మన్ చల్ల హరిశంకర్, శ్రీనివాస్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.