SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
SIR | రాష్ట్రంలో ఫామ్-7 దరఖాస్తుల వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తున్నది. మనకే తెలియకుండా మన పేరును తొలగించాలని అభ్యంతరం చెప్తూ సమర్పించే ఈ ఫామ్ ఓటర్ల పాలిట పిడుగులా మారింది.
SIR | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫామ్-7 దరఖాస్తుల వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తున్నది. మనకే తెలియకుండా మన పేరును తొలగించాలని అభ్యంతరం చెప్తూ సమర్పించే ఈ ఫామ్ ఓటర్ల పాలిట పిడుగులా మారింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో అర్హత లేని ఓటర్ల పేర్ల తొలగింపు కోసం వినియోగించాల్సిన ఫామ్-7 కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
భారీ సంఖ్యలో ఫామ్-7 దరఖాస్తులు సమర్పించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? గడువు ముగిశాక వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం ఏమిటి? ఈ దరఖాస్తులు నిజంగా సామాన్య ఓటర్లు చేశారా? రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) సమర్పించారా? లేక సంఘటితంగా కొందరు వ్యక్తులు ఒక నిర్దిష్ట వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని దరఖాస్తు చేశారా? అనే అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.
సీఈవో కార్యాలయం నుంచి అందించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో 2026 జనవరి 1 నుంచి ఈ నెల 28 వరకు ఏకంగా 5,84,179 ఫామ్-7 దరఖాస్తులు అందాయి. వీటిలో 5,10,856 దరఖాస్తులకు ఆమోదం లభించింది. 55,028 తిరసరణకు గురికాగా, మరో 18,295 పెండింగ్‌లో ఉన్నాయి. లక్షలాది ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించిన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ గడువు ముగిసిన తర్వాత నమోదైన దరఖాస్తుల సంఖ్య. అక్టోబర్ 8 నుంచి 28 వరకు, అంటే క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అనంతర కాలంలోనే 46,428 ఫామ్-7 దరఖాస్తులు అందాయి.
వీటిలో 43,733 ఆమోదం పొందాయి. కేవలం 349 తిరసరణకు గురికాగా, మరో 2,346 పెండింగ్‌లో ఉన్నాయి. ఇకడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ గడువు ముగిసిన తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఎందుకు వచ్చాయి? ఈ దరఖాస్తుల స్వభావం ఏమిటి? వాటిని ఎవరు సమర్పించారు? ఏ ఆధారాలతో ఓటర్ల పేర్ల తొలగింపునకు ఆమోదం తెలిపారు? గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించడానికి అనుసరించిన నిబంధనలు ఏమిటి? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఒక నిర్దిష్ట సామాజిక, మత, ప్రాంతీయవర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని దరఖాస్తులు సమర్పించారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
గతంలో ముషీరాబాద్ నియోజకవర్గంలో ఓ బీఎల్ఏ తప్పుడు ఉద్దేశంతో ఫామ్-7 దరఖాస్తులు పెద్దసంఖ్యలో అందించాడనే ఆరోపణలతో ఆయనపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వ్యక్తిగత ఓటర్లు సమర్పించిన ఫామ్-7 దరఖాస్తులు ఎన్ని? బీఎల్ఏలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమర్పించిన దరఖాస్తులు ఎన్ని? ఒకే వ్యక్తి లేదా ఒకే బృందం సమర్పించిన బల్ దరఖాస్తులు ఎన్ని? తప్పుగా ఓటు తొలగింపునకు గురైన అర్హులైన పౌరులకు తిరిగి తమ హకును పొందే అవకాశం ఎలా కల్పిస్తున్నారు?.. వంటి సందేహాలను ఎన్నికల అధికారులు తీర్చాల్సి ఉన్నది.
హైదరాబాద్‌లో 1.09 లక్షల దరఖాస్తులు
రాజధాని హైదరాబాద్‌లో జనవరి 1 నుంచి అక్టోబర్ 28 వరకు మొత్తం 1,09,728 ఫామ్-7 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,01,566 ఆమోదం పొందాయి. 4,984 తిరసరించగా, 3,178 పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 8 నుంచి 28 మధ్యనే హైదరాబాద్‌లో 9,560 దరఖాస్తులు అందగా, 9,272 ఆమోదం పొందాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

