రూ.52 వేల కోట్ల క్రిప్టో కరెన్సీ చోరీ!
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ బైనాన్స్పై భారీ సైబర్ దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 6.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) విలువైన క్రిప్టో కరెన్సీ చోరీకి గురైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
- క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ బైనాన్స్పై భారీ సైబర్ దాడి
- చరిత్రలోనే అతిపెద్ద హ్యాకింగ్‌గా అంచనా!
- ఉత్తర కొరియా హ్యాకర్లపై నిపుణుల అనుమానాలు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ బైనాన్స్పై భారీ సైబర్ దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 6.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) విలువైన క్రిప్టో కరెన్సీ చోరీకి గురైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీగా నిలవవచ్చని భావిస్తున్నారు. ఈ దాడిలో చోరికి గురైనట్లు భావిస్తున్న సైబర్ దాడి నేపథ్యంలో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ను కంపెనీ తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఈ దాడితో బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు 5 శాతం మేర క్షీణించాయి.
ఇంజినీర్ ల్యాప్‌టాప్ నుంచే దాడి?
బైనాన్స్ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సంస్థలోని ఒక డెవాప్స్ ఇంజినీర్ ల్యాప్‌టాప్ హ్యాకింగ్‌కు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ కంప్యూటర్ ద్వారా హ్యాకర్లు సంస్థకు చెందిన ఓ సర్వీస్ వ్యవస్థలోకి ప్రవేశించి, అనధికారికంగా క్రిప్టో ఆస్తులను ఇతర ఖాతాలకు బదిలీచేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో పది బ్లాక్‌చెయిన్‌లకు చెందిన వ్యాలెట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు బ్లాక్‌చెయిన్ విశ్లేషణ సంస్థ టీఆర్ఎం ల్యాబ్స్ తెలిపింది. దొంగిలించిన ఆస్తుల్లో అధిక బాగాన్ని కేవలం 20 నిమిషాల్లోనే తరలించినట్టు పేర్కొన్నది. అయితే వినియోగదారుల వ్యాలెట్లకు సంబంధించిన ప్రైవేట్ కీలు లీకైనట్టు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని బైనాన్స్ వెల్లడించింది.
వినియోగదారుల డబ్బుకు భరోసా
ఈ ఘటన నేపథ్యంలో బైనాన్స్ తాత్కాలికంగా డిపాజిట్లు, విత్‌డ్రాలను నిలిపివేసింది. భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత సేవలను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. హ్యాకింగ్ వల్ల కలిగే నష్టాలను సంస్థ పూర్తిగా భరిస్తుందని వ్యవస్థాపకురాలు యి హే హామీ ఇచ్చారు. టెథర్, సర్కిల్ వంటి క్రిప్టో సంస్థలు కూడా అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆస్తులను స్తంభింపజేసేందుకు చర్యలు తీసుకున్నాయి. రిపుల్ సంస్థ సైతం సుమారు 200 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిలిపివేసినట్టు సమాచారం.
ఉత్తర కొరియా హ్యాకర్లపై అనుమానాలు
ఈ సైబర్ దాడి వెనుక ఉత్తర కొరియా హ్యాకింగ్ బృందం ఉండొచ్చని టీఆర్ఎం ల్యాబ్స్, చైనాలిసిస్ సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. గతంలో భారీ క్రిప్టో చోరీలకు పాల్పడిన ట్రేడర్ట్రెయిటర్ బృందం ఈ దాడి వెనుక ఉండొచ్చని పేర్కొన్నాయి. క్రిప్టో మార్కెట్లలో కలకలం బైనాన్స్పై దాడి వార్తలతో క్రిప్టో మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు చోటుచేసుకున్నాయి. బిట్ కాయిన్, ఈథర్ ధరలు గణనీయంగా పడిపోయాయి. బైనాన్స్కు అనుబంధమైన బీఎన్బీ టోకెన్ విలువ తగ్గింది. 2025లో క్రిప్టో ఎక్సేంజ్ బైబిట్పై జరిగిన దాడిలో 1.5 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో ఆస్తులు చోరీకి గురయ్యాయి. తాజా ఘటనలో జరిగిన నష్టం అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా ఉండటంతో డిజిటల్ ఆస్తుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

