న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వివిధ హైకోర్టుల్లో కొత్తగా 110 మందికి పైగా జడ్జిలు నియమితులయ్యారు. 2016లో రికార్డు స్థాయిలో ఒకే ఏడాదిలో 126 మంది హైకోర్టు జడ్జిలను నియమించారు. ఈ రికార్డును ఈ ఏడాది తిరగరాసే అవకాశం ఉంది. దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో మొత్తం జడ్జి పోస్టుల సంఖ్య 1,098 కాగా ప్రస్తుతం 692 మందే ఉన్నారు. ఇంకా 406 ఖాళీలు ఉన్నాయి.