OTT This Weekend | ఈ వారం గణేష్ నిమజ్జనం కావడంతో అగ్ర హీరోల సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గత వారం వచ్చిన డబ్బింగ్ మూవీ కొత్త లోక (Kotha Lokah) తెలుగులో మంచి కలెక్షన్లు సాధిస్తుండగా.. మరోవైపు లేడి సూపర్ స్టార్ అనుష్క నటించిన ఘాటి చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే కాకుండా మౌళి అనే యువ నటుడు నటించిన ‘లిటిల్ హార్ట్స్’, శివ కార్తికేయన్ ‘మదరాసిస చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఈ వీకెండ్లో ఓటీటీలో సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఆ చిత్రాలేంటి అనేది చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్
ది ఫాల్ గాయ్ – సెప్టెంబర్ 3
వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ 2 (తెలుగు ) – సెప్టెంబర్ 3
ఇన్స్పెక్టర్ జెండే (తెలుగు ) – సెప్టెంబర్ 5
క్వీన్ మాంటిస్ (కొరియన్ ) – సెప్టెంబర్ 5
లవ్ కాన్ రివేంజ్ (ఇంగ్లీష్ ) – సెప్టెంబర్ 5
డాక్టర్ సూస్స్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 5
జియో హాట్‌స్టార్
లిలో అండ్ స్టిచ్ (తెలుగు) – సెప్టెంబర్ 3
ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (హాలీవుడ్) – సెప్టెంబర్ 4
ఎన్సీఐఎస్: టోనీ అండ్ జివా (హాలీవుడ్ ) – సెప్టెంబర్ 5
ది పేపర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 5
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (రియాలిటీ షో) – సెప్టెంబర్ 7
సు ఫ్రమ్ సో (తెలుగు) సెప్టెంబర్ 09
అమెజాన్ ప్రైమ్
కన్నప్ప (తెలుగు) – సెప్టెంబర్ 4
మాలిక్ (హిందీ) – సెప్టెంబర్ 5
డిష్ ఇట్ అవుట్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 5
అవుట్‌హౌస్ (హిందీ) – సెప్టెంబర్ 1
సన్ నెక్ట్స్
ఫుటేజ్ – సెప్టెంబర్ 5