Red Fort | ఎర్రకోటలో భారీ దొంగతనం.. రూ.కోటి విలువైన కలశాలు మాయం..!
Red Fort | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) లో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల అక్కడ జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.కోటి విలువైన రెండు బంగారు కలశాలు (Gold Kalash) చోరీకి గురయ్యాయి.
Red Fort : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) లో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల అక్కడ జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.కోటి విలువైన రెండు బంగారు కలశాలు (Gold Kalash) చోరీకి గురయ్యాయి. అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 3న ఉదయం ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ తీసుకొచ్చిన బంగారు కలశాలు కనిపించకుండా పోయాయి.
పూజ కోసం తాను తీసుకువచ్చిన 760 గ్రాములు బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం పూజ అనంతరం కనిపించలేదని సుధీర్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదుచేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవ్వడంతో తాము పక్కకు వెళ్లామని, అంతలోనే ఈ దొంగతనం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎర్రకోట నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజసామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి, రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. చోరీ అనంతరం అతడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

