Bigg Boss 9 | తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి సీజన్ 9 సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు బిగ్‌బాస్ 9 గ్రాండ్ ప్రీమియర్ జరగనుండగా, ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు బిగ్‌బాస్‌లో ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే హౌజ్‌లోకి అడుగుపెట్టి సందడి చేశారు. కానీ ఈసారి ప్రేక్షకులకి మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు షో టీమ్ ఒక వినూత్న ప్రయోగానికి తెరలేపింది. “కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్” కాన్సెప్ట్‌తో సీజన్ 9 ముందుకు రానుంది.
ఈసారి మొత్తం 15 మంది హౌజ్మేట్లు బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. వీరిలో 9 మంది సెలబ్రిటీలు కాగా, మిగిలిన 6 మంది సామాన్య ప్రజలే. కామనర్స్‌ను ఎన్నుకోవడానికి షో నిర్వాహకులు అగ్నిపరీక్ష పేరుతో పలు టాస్క్‌లు నిర్వహించిన విషయం తెలిసిందే . ఓటింగ్ మరియు జ్యూరీ ద్వారా చివరికి ఆరుగురిని ఎంపిక చేశారు.
సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తే :
సంజనా గల్రానీ – ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం.
రీతూ చౌదరి – యాంకర్‌గా, జబర్దస్త్ వంటి షోల్లో కనిపించింది.
తనూజ గౌడ – పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.
ఆశాశైనీ – ‘నరసింహ నాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి సినిమాల్లో నటించిన నటి.
శ్రష్ఠి వర్మ – కొరియోగ్రాఫర్‌గా పలు డ్యాన్స్ షోలలో మెరిసింది.
భవాణి శంకర్ – సీరియల్స్‌లో నటించిన నటుడు.
సుమన్ శెట్టి – జయం, 7/G బృందావన్ కాలనీ వంటి హిట్ సినిమాల్లో కామెడీ నటుడు.
సింగర్ రాము రాథోడ్ – యూట్యూబ్‌లో హిట్ అయిన ఫోక్ పాటలతో పాపులర్.
ఇమ్మానుయేల్ – జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన కామెడీ ఆర్టిస్ట్.
కామనర్స్ లిస్ట్ చూస్తే :
శ్రీజ దమ్ము
మాస్క్ మ్యాన్ హరీష్
కల్యాణ్ పడాలా
మర్యాద మనీష్
దివ్యా నికితా
డిమోన్ పవన్ లేదా నాగ ప్రశాంత్ – వీరిలో ఒకరు తుది ఎంపికలో హౌజ్‌లోకి వెళ్లనున్నారు.
సెప్టెంబర్ 7వ తేదీ, ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ మాలో ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో 24×7 లైవ్ ఫీడ్ అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్లో కామనర్స్ మరియు సెలబ్రిటీల మధ్య జరగబోయే పోటీ మంచి మజా అందిస్తుందని అంచనా. ప్రేక్షకుల రుచులకు తగ్గట్లు డ్రామా, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలగలిసిన షోగా బిగ్‌బాస్ 9 నిలవాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇంకొన్ని గంటల్లో సీజన్ 9 స్టార్ట్ అవుతుంది… మరి మీరంతా బిగ్‌బాస్ మ్యాజిక్కు రెడీ అవ్వండి.