Osmania University | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ ఆహారం పెడుతున్నారని ఓయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని గోదావరి హాస్టల్ వద్ద విద్యార్థులు నిరసన దిగారు. ఆహారం బాగాలేదని, నాణ్యత పెంచాలని కాంట్రాక్టర్‌కు విద్యార్థులు సూచించారు. కల్తీ ఆహారం తిని అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు, ఓయూ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఓయూ ప్రధాన రహదారిపై భోజనంతో కూడి పాత్రలతో నిరసనకు దిగారు. ఆహారం బాగాలేదని చెప్తే.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని విద్యార్థులు పేర్కొన్నారు. నాణ్యత లేని కల్తీ ఆహారాన్ని పెడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
కల్తీ ఆహారాన్ని పెడుతున్నారని ఓయూ విద్యార్థుల నిరసన
ఓయూ యూనివర్సిటీలోని గోదావరి హాస్టల్ వద్ద విద్యార్థుల నిరసన
ఆహారం బాలేదంటే ఏం చేసుకుంటారో చేసుకోండని ఫుడ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు సమాధానం
నాణ్యత లేని కల్తీ ఆహారాన్ని పెడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని, నాణ్యమైన… pic.twitter.com/ftNzrNtZXM
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2025