హైదరాబాద్: ఆల్ఇండియా యూనివర్సిటీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కళింగ యూనివర్సిటీ వేదికగా శనివారం జరిగిన టోర్నీ క్వార్టర్స్ పోరులో ఉస్మానియా 3-1 తేడాతో ఎమ్డీ యూనివర్సిటీపై విజయం సాధించింది. తొలుత సింగిల్స్‌లో సాయికార్తీక్ రెడ్డి 6-1, 6-2తో అమన్‌దీప్‌పై అలవోకగా గెలిచాడు. మరో సింగిల్స్‌లో సుహిత్ 2-6, 6-4, 6-2తో దీపిందర్పై గెలువడంతో ఉస్మానియా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే డబుల్స్‌లో ఉస్మానియా ద్వయం ఆకాశ్, నిఖిల్ 2-6, 2-6తో ఎమ్డీ యూనివర్సిటీ జోడీ దీపిందర్, నితిన్ చేతిలో ఓడింది. ఆఖరిదైన మూడో సింగిల్స్‌లో కార్తీక్ 6-0, 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో దీపిందర్ రిటైర్డ్‌హార్ట్ కావడంతో ఉస్మానియా 3-1తో గెలిచింది.