FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ తుది అంకానికి చేరడంతో ముగింపు వేడుకలపై నిర్వాహకులు దృష్టి సారించారు. 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీ జూలై 19 ఆదివారంతో పూర్తి కానున్నందున.. అభిమానులను రంజింపజేసేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లోని న్యూ జెర్సీ స్టేడియం (New Jersey)లో జరుగనున్న ‘క్లోజింగ్ సెరెమొనీ’లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్(Tom Cruise), ఇంటర్నెట్ సెన్సేషన్ ‘ఐషోస్పీడీ’ సహా పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొననున్నారు.
సాకర్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ విజేత ఎవరో ఆదివారంతో తేలిపోనుంది. ఫ్రాన్స్‌ను చిత్తుచేసిన స్పెయిన్‌ను ఢీకొట్టే జట్టేదో రెండో సెమీఫైనల్లో ఖరారు కానుంది. దాంతో, టైటిల్ పోరుకు ముందు ఆనావాయితీ అయిన ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. న్యూ జెర్సీ స్టేడియంలో మ్యాచ్‌కు 90 నిమిషాల ముందు ఆటగాళ్లతో పాటు అభిమానులను అలరించేందుకు పలువురు సినీ సెలబ్రిటీలను ఆహ్వానించింది.
🚨 𝗢𝗙𝗙𝗜𝗖𝗜𝗔𝗟: FIFA have announced that the following people will perform at the World Cup closing ceremony:
🇺🇸 Tom Cruise
🇺🇸 IShowSpeed
🏴 Robbie Williams
🇺🇸 Jennifer Hudson
🇺🇸 Nicole Scherzinger
🇮🇹 Laura Pausini pic.twitter.com/fIbXpqDiDR— Transfer News Live (@DeadlineDayLive) July 14, 2026
ఆస్కార్ అవార్డు విజేత, గాయని జెన్నిఫర్ హడ్సన్(Jennifer Hudson) అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించనుంది. ఆస్కార్ విజతే, అమెరికా నటుడు టామ్ క్రూజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. రాబీ విలియమ్స్(ఇంగ్లిష్ గాయకుడు, గేయ రచయిత), లారా పాసిని(ఇటలీ పాప్ సింగర్), నికొలె షెర్జింజర్(అమెరికా గాయని)లు తమ గాత్రంతో ఫ్యాన్స్‌ను సంగీతసాగరంలో ఓలలాడించనున్నారు. ఇంటర్నెట్ సంచలనం యూట్యూబర్ ఐషోస్పీడ్ తన మార్క్ హావభావాలతో సందడి చేయనున్నాడు.
🚨⚽✅ FIFA confirm the World Cup closing ceremony for the biggest sporting event in the world will feature Global superstars;
🇺🇸 IShowSpeed
🇮🇹 Laura Pausini
🇺🇸 Nicole Scherzinger
🏴 Robbie WilliamsAs well as a special appearance by Tom Cruise 🇺🇸, bringing together some of the… pic.twitter.com/Dkk5vejj1w
— CloudNine Sports (@cloudninesports) July 14, 2026
‘ముగింపు వేడుకల్లో సంగీతం, సంస్కృతి, ఫుట్‌బాల్ థీమ్‌తో టోర్నమెంట్ మొత్తాన్ని ప్రతిబింబిస్తామ’ని వరల్డ్‌కప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హీమో ష్లిర్గి వెల్లడించాడు. ఈ ముగింపు వేడుకల్లో మెరిసే తారలు, ప్రముఖుల జాబితాలో మరొకొందరు పేర్లు చేరే అవకాశముందని సమాచారం.