e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News ఆస్కార్ నామినేషన్స్‌.. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రేసులో 'ది వైట్ టైగర్'

ఆస్కార్ నామినేషన్స్‌.. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రేసులో ‘ది వైట్ టైగర్’

లాస్ ఏంజెల్స్ : వచ్చే నెలలో జరుగనున్న 93 వ అకాడమీ అవార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తికావచ్చింది. అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో “ది వైట్ టైగర్” సినిమా నామినేషన్‌ ఖరారైంది. ఈ చిత్రం రామిన్‌ బహ్రానీ దర్శకత్వంలో ఆదర్శ్‌ గౌరవ్, ప్రియాంక చోప్రా జోనాస్ నటించారు. ఈ మేరకు గౌరవ్‌, ప్రియాంక ఆమె భర్త నిక్‌ జోనాస్‌ సోమవారం సాయంత్రం ఆస్కార్ నామినేషన్లను ప్రకటించారు.

10 నామినేషన్లతో “మాంక్” ఈ సంవత్సరం అత్యధిక నామినేషన్లను సంపాదించింది. “సిటిజెన్ కేన్” సహ-స్క్రీన్ ప్లే రచయిత హర్మన్ జే మాన్‌కీవిచ్ జీవితం ఆధారంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ బయోపిక్. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (డేవిడ్ ఫించర్), ఉత్తమ నటుడు (గారి ఓల్డ్‌మన్), ఉత్తమ నటి సహాయక పాత్రలో (అమండా సెయ్ ఫ్రిడ్) నామినేట్‌ అయ్యారు.

- Advertisement -

“ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7” (ఆరు నామినేషన్లు), “జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సీయ” (ఆరు), “ది ఫాదర్” (ఆరు), “మా రైనీస్ బ్లాక్ బాటమ్” (ఐదు) బహుళ నామినేషన్లను గెలుచుకున్న చిత్రాలుగా నిలిచాయి. దివంగత చాడ్విక్ బోస్మాన్ “మా రైనీస్ బ్లాక్ బాటమ్” సినిమా ఉత్తమ నటుడి విభాగంలో పోటీపడుతున్నారు.

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 25 న జరుగనున్నది. అవార్డుల ప్రదానోత్సవం పూర్తిగా వర్చువల్, లైవ్ యాక్షన్ ప్రెజెంటేషన్‌గా ఉంటుంది. కార్యక్రమం హోస్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఉత్తమ చిత్రం క్యాటగిరికి నామినేట్ అయిన చిత్రాలు

ది ఫాదర్‌

జుడాస్ మరియు బ్లాక్ మెస్సీయ

మాంక్

నోమడ్లాండ్

ప్రామీజింగ్‌ యంగ్‌ వుమెన్‌

సౌండ్ ఆఫ్ మెటల్

ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7

ఇవి కూడా చదవండి..

చైనా వ్యాక్సిన్‌ను తిరస్కరిస్తున్న తైవాన్‌ ప్రజలు.. ఎందుకంటే..?

బెంగాల్‌, అసోం ఎన్నికల బరిలో జేడీయూ

109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్‌.. చరిత్రలో ఈరోజు


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement