కొందరి చర్మం చాలా సున్నిగా ఉంటుంది. వీరికి ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ పడవు. ఏ క్రీమ్ రాసినా.. వెంటనే సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి. మొటిమలు వచ్చినా.. తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి వారు.. సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే ఫేస్‌ప్యాక్స్ తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు బ్యూటీషియన్లు. తులసి, వేప ఆకుల పొడి, నారింజ రసం, పచ్చిపాలు కలిపి.. మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని మొటిమలు ఉన్నదగ్గర అప్లయి చేయాలి. తులసి, వేప ఆకుల్లో ఉండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను ఇట్టే తగ్గిస్తాయి. నారింజ రసం, పచ్చిపాలతో చర్మం సరికొత్త మెరుపును సంతరించుకుంటుంది. సహజసిద్ధమైన ఈ పదార్థాలు చర్మానికి ఎలాంటి హానీ కలగనివ్వవు.