– ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
– సింగరేణి తాసీల్దార్ వెంకటేశ్వర్లు
కారేపల్లి, సెప్టెంబర్ 29 : నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని సింగరేణి మండల తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 01-11-2026 నాటికి గత మూడు సంవత్సరాల ముందు, అంటే 01-11-2023 నాటికి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన వారు పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. గత 2024 పట్టభద్రుల ఓటర్ల జాబితాలో ఇప్పటికే నమోదై ఉన్నవారు సైతం ఫారం–18 ద్వారా కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తాసీల్దార్ కోరారు.