న్యూఢిల్లీ : భారత్‌లో ఒప్పో తన లేటెస్ట్ ఎఫ్21ఎస్ ప్రొ సిరీస్‌ను లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ, ఒప్పో ఎఫ్21ఎస్ 5జీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసింది. రానున్న పండగ సీజన్‌కు ముందు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ ఒప్పో ఫోన్లు రూ 22,999 నుంచి అందుబాటులో ఉంటాయి.
ఈ ధరలో మార్కెట్లోని ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను పోలిన విధంగానే రెండు ఒప్పో ఫోన్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లలో మైక్రోలెన్స్‌తో కూడిన కెమెరా ఫీచర్ కస్టమర్లను ఆకట్టుకోనుంది. రూ 25,000 లోపు ఈ ఫీచర్ కలిగిఉండటం ఓ ప్రత్యేకతగా టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ, ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ ప్రీ ఆర్డర్లు షురూ అయినా సెప్టెంబర్ 19 నుంచి షిప్పింగ్, లభ్యత అందుబాటులోకి వస్తాయి. ఒప్పో ఎఫ్21 ప్రొ సిరీస్ క్వాల్‌కాం ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఫోటోలు, వీడియోలు క్లారిటీని కోరుకునే వారికి అందుబాటు ధరలో ఈ స్మార్ట్ఫోన్లు అనువైనవని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.