Oppo A7 Pro Max | ఒప్పో ‘A సిరీస్’లో అత్యంత భారీ బ్యాటరీతో కూడిన ఒక ఫోన్‌ను తీసుకువస్తున్నట్లు ‘టెక్ సమాజంలో లీక్ అయిన సమాచారం’ హల్ చేస్తుంది. ఈ సిరీస్ ఫోన్లలో ఇప్పటివరకు చాలా ఫోన్లు వచ్చాయి. ఇంత భారీ బ్యాటరీతో ఫోన్ వస్తే వినియోగదారులకు సంతోషమే కదా.
ఈ ఫోన్‌కు ‘ఒప్పో A7 ప్రో మ్యాక్స్’ అని పేరు పెట్టినట్లు సమాచారం. దీని ప్రకారం ఈ ఫోన్లో 10,000 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ (Snapdragon) 4 Gen 5 చిప్సెట్ హై రిఫ్రెష్ రేట్ కలిగిన OLED డిస్ప్లే ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే సన్నని డిజైన్‌తో 80W ఫాస్ట్ చార్జింగ్ ఉండనుంది.
కానీ ఈ ఫోన్ గురించి ఒప్పో సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఈ విషయాలు చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా, మైక్రో ఫ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ అయిన వీబో (Weibo, దాదాపు ట్టిట్టర్ లాంటిది)లో వెలువడినాయి. దీని ప్రకారం ఈ ఫోన్లో పైన చెప్పిన ఫీచర్స్‌తో పాటు 1.5 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచుల ప్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండవచ్చు.
అదేవిధంగా భద్రత కోసం దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంది. దీనిలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఫొటోలు వీడియో కాలం కోసం 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండే ఈ ఫోన్ మందం 8.47mm, బరువు 226 గ్రాములు ఉంటుందని సమాచారం.