మేడ్చల్, మార్చి 31(నమస్తే తెలంగాణ)/మంథని టౌన్: యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా స్థానిక సంస్థల పాలక వర్గాల ఏకగ్రీవ తీర్మానాలు కొనసాగుతున్నాయి. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాగా మేడ్చల్ జడ్పీతోపాటు జిల్లా వ్యాప్తంగా 61 గ్రామపంచాయతీలు, 5 మండల పరిషత్లు, 13 మున్సిపాలిటీలు చేసిన తీర్మాన ప్రతులను ప్రధాని నరేంద్రమోదీ, మంత్రి పీయూష్ గోయల్ అధికార నివాసాలకు పంపించినట్టు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.