పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు..
నిజామాబాద్ జిల్లా ముఖ్య ప్రజా ప్రతినిధుల నిర్ణయం
జీవన్‌రెడ్డిని సన్మానించిన మంత్రి, ఎమ్మెల్యేలు
వేల్పూర్, ఫిబ్రవరి 2: టీఆర్ఎస్ నాయకులందరూ ఒకే మాట.. ఒకే బాటగా నిలిచారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. ఈ విషయ మై హైదరాబాద్‌లో వారు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్, బోధన్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, షకీల్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలితతో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తూ.. పార్టీ ఆవిర్భావం నుంచి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్కు అడ్డ అని, దాన్ని నిలబెట్టా లని నిర్ణయించారు. జిల్లాలోని నాయకులందరినీ కలుపుకుపోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారనే విశ్వాసం తనకున్నదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.