హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ( Danam Nagendhar ) అనర్హతపై సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ ( KTR Tweet ) చేశారు. ఒక వికెట్ పడింది. త్వరలో మరికొన్ని వికెట్లు పడుతాయని జోస్యం చెప్పారు.
దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందిన తరువాత కాంగ్రెస్‌లో చేరడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే హైకోర్టులో కేసు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం దానంపై అనర్హత వేయాలని కోర్టును కోరారు.
దాదాపు రెండు సంవత్సరాల వరకు ఇరువాదనలు విన్న హైకోర్టు రెండు రోజుల క్రితం దానం నాగేందర్‌పై అనర్హత వేసింది. అనర్హత చెల్లదని సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పిటిషన్ వేయగా గురువారం పిటిషన్‌ను పరిశీలించింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది.