రామాయంపేట/ తూప్రాన్ : రోడ్డు ప్రమాదంలో ( Road Accident) ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తూప్రాన్ ( Toopran) పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. తూప్రాన్ ఎస్సై శివానందం( Si Shivanandam) తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం శెట్పల్లికలాన్ గ్రామానికి చెందిన తలకొక్కుల శివరాములు(42) తూప్రాన్ పట్టణంలోని వినోద్ దాబాలో పని చేస్తాడని వివరించారు.
ఎప్పటిలాగే తన సైకిల్‌పై పనులకు వెళ్తుండగా మార్గమధ్యలో తూప్రాన్ పట్టణ శివారులో నలంద కళాశాల వద్ద వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం సైకిల్‌ను ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని వివరించారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి సోదరుడు తలకొక్కుల మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.