హైదరాబాద్: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో (Mailardevpally) ఇన్నోవా కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.
బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేదంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు (AP09 BP 9444) అదుపుతప్పి దుర్గానగర్ వద్ద ఓ షెడ్డులోకి దూసుకెళ్లిది. దీంతో అందులో నిద్రిస్తున్న వారిపైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో దీపక్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అతని తండ్రి ప్రభుమహరాజ్ (60), సత్తునాథ్ (27) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఉస్మానియా దవాఖానకు తరలించారు. బాధితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. శంషాబాద్ నుంచి సంతోశ్‌నగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు.