Viral Video | సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మరొకరి నాలుక తెగి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా కమ్మసంద్రలో ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కమ్మసంద్రలో క్రికెట్ పోటీలకు ఇద్దరు స్నేహితులు ప్రశాంత్ (35), రోషన్ హెగ్డే వెళ్లారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు మద్యం సేవించారు. ఈ క్రమంలో స్నేహితులు ఇద్దరి మధ్య సిగరెట్ లైటర్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవ ముదరడంతో బీర్ బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్రగాయమైంది.
తీవ్ర గాయాలు కావడంతో భయపడిపోయిన రోషన్ తన కారులో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రశాంత్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కారు డోర్ పట్టుకుని అడ్డగించేందుకు చూశాడు. దీంతో ప్రశాంత్‌ను అలాగే కారుతో ఈడ్చుకెళ్లి వేగంగా చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ప్రశాంత్ మృతికి కారణమైన రోషన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోషన్ నాలుక తెగిపోవడంతో పాటు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు కారు డ్యాష్‌బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి.
సిగరెట్ లైటర్ కోసం గొడవ, స్నేహితుడిని కారుతో గుద్ది హతమార్చిన నిందితుడు
కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో దారుణం
కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డైన దృశ్యాలు
కమ్మసంద్రలో క్రికెట్ పోటీ నిర్వహించగ.. ఈ పోటీలకు వెళ్లిన స్నేహితులు ప్రశాంత్(35), రోషన్
అయితే ఆట ముగిశాక మ్యాచ్ తర్వాత… pic.twitter.com/zZsd71ZLhj
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2026