RanaBaali | ‘రణబాలి’గా విజయ్ దేవరకొండ.. ఆసక్తికరంగా టైటిల్ గ్లింప్స్
RanaBaali | గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్ప్రైజ్ను ఇచ్చింది.
RanaBaali | గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్ప్రైజ్ను ఇచ్చింది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్టుకు ‘రణబాలి’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 1854 నుంచి 1878 మధ్యకాలంలో బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పట్లో బ్రిటిష్ వారు సృష్టించిన కరువు పరిస్థితులు, వారి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరయోధుడి కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ ఒక రఫ్ అండ్ పవర్ఫుల్ వారియర్ లుక్‌లో కనిపిస్తుండగా, బ్రిటిష్ వారు అతడిని ఒక అనాగరికుడిగా పిలిచేవారని, కానీ మన చరిత్రలో అతడొక గొప్ప వీరుడని గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు. ‘టాక్సీవాలా’ వంటి విజయం తర్వాత విజయ్ – రాహుల్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.
ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హాలీవుడ్ చిత్రం ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ – అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

