న్యూఢిల్లీ : బాలీవుడ్ మూవీ పాటకు 82 ఏండ్ల వ్యక్తి వేసిన స్టెప్పులకు స్టేజీ దద్దరిల్లింది. మెరుపులా కదులుతూ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో తాత వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఖూబ్సూరత్ మూవీలోని అభి థో పార్టీ షురూ హుయి హై అనే పాటకు 82 ఏండ్ల వ్యక్తి డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీగం పటేల్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్‌తో వృద్ధుడి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఐ లవ్ దిస్ మ్యాన్ అంటూ వీడియో చివరన నీగం వ్యాఖ్యానించారు. ఫైనల్ రౌండ్…గోల్డెన్ బజర్! అంకుల్ ఫౌండ్ ది పౌంటెన్ ఆఫ్ యూత్ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో పెద్దాయన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయి కామెంట్స్ సెక్షన్లో ఆయనపై ప్రేమను కురిపించారు. వావ్..82 ఏండ్ల వయసులో ఇలా డ్యాన్స్ చేసేందుకు జిమ్‌కు వెళతానని ఓ యూజర్ కామెంట్ చేయగా ఓమైగాడ్ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. సోనం కపూర్, ఫవాద్ ఖాన్లు నటించిన 2014 మూవీ ఖూబ్సూరత్లోని పాటకు పెద్దాయన డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పుడు చిన్నా పెద్దా అందరినీ ఊపేస్తున్నాయి.