Road Accident | నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు.
కారును ఢీకొట్టిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆయిల్ ట్యాంకర్ను తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.