Frontier jet : కంచె దాటి ఎయిర్‌పోర్టులోకి వచ్చిన ఓ వ్యక్తి రన్‌వే దాటుతుండగా.. ఓ భారీ ఎయిర్‌బస్ ఏ-321 విమానం అతడిని ఇంజిన్లోకి లాగేసుకుంది. అమెరికా (USA) లోని కొలరాడో (Colarado) లో ఈ ఘటన చోటుచేసుకొంది. స్థానిక డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (Denver International airport) లో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ (Take off) అయ్యే సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా కంచె దూకి రన్‌వేకు అత్యంత సమీపంలోకి వచ్చాడు. దాంతో అతడిని విమానం ఇంజిన్ ఒక్కసారిగా లోపలకు లాగేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Frontier Airlines jet plane strikes a trespasser on the runway during takeoff at Denver International Airport. 🪦 ✈️ pic.twitter.com/l2OhYrJxJ6
— The Last Best Hope of Earth (@TheLastHopeUSA) May 10, 2026
⚠️ Frontier plane at Denver fatally struck a person on the runway. Aborted takeoff after smoke. Passengers evacuated safely. Heart goes out to the family. Investigation ongoing. 🙏 pic.twitter.com/hvIXDL8DV6
— The Last Best Hope of Earth (@TheLastHopeUSA) May 9, 2026
అతడి శరీరం పైభాగం ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. ఇంజిన్ నుంచి భారీగా మంటలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానం గంటకు 139 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. విమానం లోపల కూర్చున్న ప్రయాణికులకు ఇంజిన్‌లో నుంచి మనిషి కాళ్లు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంజిన్ నుంచి భారీ శబ్దాలు వినిపించడంతోపాటు మంటలు వెలువడ్డాయి. దాంతో విమానం టేకాఫ్‌ను నిలిపేసి ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించేశారు.