Peddi | ‘పెద్ది’ ట్రైలర్‌కు భారీ ప్లాన్.. భోపాల్‌లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్?
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ హైప్ తీసుకురాగా.. ఇప్పుడు ట్రైలర్‌కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ హైప్ తీసుకురాగా.. ఇప్పుడు ట్రైలర్‌కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ‘పెద్ది’ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు విడుదలైన రెండు గ్లింప్స్‌తో పాటు “చికిరి చికిరి”, “రయ్ రయ్ రారా” పాటలు సోషల్ మీడియాలో మంచి స్పందన దక్కించుకున్నాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్, రామ్ చరణ్ మాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ ట్రైలర్‌ను మే 16న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఈ ట్రైలర్ లాంచ్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో భారీ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే నార్త్ ఇండియాలో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా 1980ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, డీ-గ్లామర్ లుక్‌లో కనిపించబోతున్నారు. పహిల్వాన్ తరహా పవర్ఫుల్ పాత్రలో ఆయన నటిస్తున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం, ఎమోషనల్ కథ, గ్రామీణ బ్యాక్‌డ్రాప్ సినిమాపై అన్ని భాషల్లోనూ మంచి బజ్‌ను తీసుకొచ్చాయి. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందిస్తున్న సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. ఆడియో పరంగా కూడా ‘పెద్ది’ భారీ విజయాన్ని అందుకునేలా కనిపిస్తోంది.పాన్ ఇండియా రిలీజ్‌ను దృష్టిలో పెట్టుకుని మూవీ టీమ్ ఉత్తర భారతదేశంలో కూడా ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిమానులంతా మే 16 ట్రైలర్ అప్డేట్ అధికారికంగా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bhopal
- peddi
- ram charan
- trailer
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

