Faria Abdullah | పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. భవిష్యత్తులో వివాహం అర్థమే మారిపోవచ్చు..
Faria Abdullah |ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన చలాకీతనం, కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. తాజాగా ప్రేమ, పెళ్లి, జీవితంపై తన అభిప్రాయాలను పంచుకుని ఆసక్తికర చర్చకు తెరలేపింది.
Faria Abdullah |ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన చలాకీతనం, కామెడీ టైమింగ్‌తో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. తాజాగా ప్రేమ, పెళ్లి, జీవితంపై తన అభిప్రాయాలను పంచుకుని ఆసక్తికర చర్చకు తెరలేపింది. పెళ్లి గురించి మాట్లాడుతూ ఫరియా చాలా భిన్నమైన ఆలోచనలు వ్యక్తం చేసింది. తన దృష్టిలో ప్రేమ, వివాహం రెండూ వేర్వేరు అంశాలని ఆమె చెప్పింది. మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారనే భావన చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక తోడు ఉండటం కూడా అవసరమే.
కానీ పెళ్లి అనేది ఒక మనిషిని పూర్తిగా మార్చే బంధం. ఇప్పుడు యువతలో వివాహంపై ఆసక్తి తగ్గిపోతోంది. రాబోయే రోజుల్లో పెళ్లి అనే మాటకు అర్థమే మారిపోయే అవకాశం ఉంది” అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత ఈ తరం రిలేషన్‌షిప్స్‌ను చూసే విధానం పూర్తిగా మారిపోయిందని ఫరియా అభిప్రాయపడింది. స్వేచ్ఛ, వ్యక్తిగత స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న యువత.. సంప్రదాయ బంధాలపై అంత ఆసక్తి చూపించడం లేదని ఆమె విశ్లేషించింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తన వ్యక్తిగత జీవితంపై కూడా ఫరియా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒకవేళ తాను హీరోయిన్ కాలేదంటే.. పెద్ద క్రూయిజ్ షిప్లో చెఫ్‌గా పనిచేసేదాన్నని లేదా ఈవెంట్ మేనేజర్‌గా కెరీర్ కొనసాగించేదాన్నని తెలిపింది. ట్రావెలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, ట్రావెల్ వ్లాగర్‌గా కూడా మారే అవకాశం ఉండేదని చెప్పింది.హైదరాబాద్‌కు చెందిన ఫరియా అబ్దుల్లా కేవలం నటి మాత్రమే కాదు.. మంచి డ్యాన్సర్, రచయిత్రి కూడా. హైదరాబాద్‌లోని లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న సమయంలో ఆమె ప్రతిభను దర్శకుడు నాగ్ అశ్విన్ గుర్తించారు. ఆ తర్వాత ఆడిషన్ ద్వారా జాతిరత్నాలు సినిమాలో అవకాశం దక్కించుకుని ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను పెద్దగా పట్టించుకోనని, మంచి కథలు, బలమైన పాత్రలే తనకు ముఖ్యమని ఫరియా స్పష్టం చేసింది. పాత్ర చిన్నదైనా.. క్యారెక్టర్ డిజైన్ బాగుంటే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను మరోసారి చాటుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

