ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌కు రైతులు జొన్నలు భారీగా తీసుకురావడంతో మార్కెట్ ముందు వాహనాల రద్దీ నెలకొంది. నాలుగు రోజులుగా పంట కొనుగోలు నిలిచిపోవడంతో గురువారం నుంచి జొన్నల సేకరణ ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఒకరోజు ముందుగానే పంటను మార్కెట్ కు తీసుకువచ్చారు.
మార్కెటింగ్ సిబ్బంది వాహనాలను లోనికి అనుమతించకపోవడంతో రైతులు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం జొన్న పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దీంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని రైతులు పండించిన మొత్తం పంటను సేకరించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.