నిజామాబాద్ : మహారాష్ట్రలోని ఎగువ గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ గేట్లను సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి), మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తివేశారు. బాబ్లీ ప్రాజెక్టులో నీటి నిల్వ స్వల్పంగా ఉండడంతో తెలంగాణ ప్రాంతానికి కేవలం 0.20 టిఎంసిల వరద మాత్రమే వచ్చింది. ఈ దశాబ్ద కాలంలో ఎగువ గోదావరి నుంచి ఇంత తక్కువ మొత్తంలో వరద రావడం ఇదే తొలిసారి అని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
ఎత్తిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ 28వ తారీఖు వరకు తెరిచి ఉంటాయి. అంతర్ రాష్ట్ర జలవివాదాలు నేపథ్యంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏటా వర్షాకాలంలో, ఎండాకాలంలో బాబ్జి గేట్లను ఎత్తి దిగువకు వరద వదిలిపెడుతున్నారు.