Student Stabs Teacher | టీసీ కోసం వివాదం.. టీచర్‌పై కత్తితో దాడి చేసిన స్టూడెంట్
Student Stabs Teacher | ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) తీసుకునేందుకు విద్యార్థి స్కూల్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ఒక టీచర్, అతడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ స్టూడెంట్ తన వెంట తెచ్చిన కత్తితో ఉపాధ్యాయుడ్ని పొడిచాడు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) తీసుకునేందుకు విద్యార్థి స్కూల్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ఒక టీచర్, అతడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ స్టూడెంట్ తన వెంట తెచ్చిన కత్తితో ఉపాధ్యాయుడ్ని పొడిచాడు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Student Stabs Teacher) మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదివిన విద్యార్థి టీసీ తీసుకునేందుకు వచ్చాడు. ప్రిన్సిపాల్ క్యాబిన్లో ఆ విద్యార్థి, క్లాస్ టీచర్ మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ఈ సందర్భంగా ఆ యువకుడు దూకుడుగా ప్రవర్తించడంతో పాటు ఆ ఉపాధ్యాయుడ్ని బెదిరించాడు. దీంతో అతడ్ని వారించేందుకు ఆ టీచర్, ప్రిన్సిపాల్ తమ సీట్ల నుంచి పైకి లేచారు. క్షణాల్లోనే ఆ స్టూడెంట్ కత్తి తీసి ఉపాధ్యాయుడి ఛాతిపై పొడిచాడు. ఆ తర్వాత ఆ యువకుడు గట్టిగా అరవడంతో స్కూల్ సిబ్బంది లోపలకు వచ్చారు. అతడ్ని శాంత పరిచేందుకు ప్రయత్నించి అదుపులోకి తీసుకున్నారు. కత్తి దాడిలో గాయపడిన టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకున్నారు. టీచర్‌పై కత్తితో దాడి చేసిన స్టూడెంట్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు స్కూల్లో చదివినప్పుడు కూడా ఆ టీచర్‌తో గొడవపడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని అతడు ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఆ విద్యార్థిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రిన్సిపాల్ రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
शाळेच्या मुख्याध्यापिकेच्या केबिनमध्येच रक्ताचा सडा! ९ वीत नापास केल्याच्या रागातून टीसी मागण्यास आलेल्या विद्यार्थ्याचा थेट वर्गशिक्षकावर चाकूने जीवघेणा हल्ला #chhatrapatisambhajinagar #marathwada pic.twitter.com/PMRqmiPzvL
— Lokmat Chhatrapati Sambhajinagar (@milokmatabd) June 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

