ధరణి సమస్యల పరిష్కారానికి కసరత్తు

- వివిధ వర్గాల నుంచి సబ్‌కమిటీ దృష్టికి 34 రకాల సమస్యలు
- 11సమస్యలను గుర్తించిన అధికారులు
- పరిష్కార మార్గాలపై కసరత్తు.. వచ్చేవారం మరోసారి కమిటీ భేటీ
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ధరణిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమై వచ్చిన సమస్యలపై చర్చించింది. వివిధ రైతుసంఘాలు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా), క్రెడాయ్ తదితర వర్గాల ప్రతినిధులు ఇప్పటికే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వీటిని అధికారులు విశ్లేషించగా ప్రధానంగా సర్వే నంబర్లు కనిపించకపోవడం, విస్తీర్ణం, పేర్లు తప్పుగా నమోదవడం, పాస్‌బుక్ మంజూరు కాకపోవడం, సాగుభూమి వ్యవసాయేతర భూమిగా కనిపించడం, ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి తప్పుగా నమోదవడంపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
11 రకాల ఇబ్బందులు
మొత్తం 34 రకాల సమస్యలను అధికారులు సబ్‌కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు 22 రకాల సమస్యలకు ధరణిలో మాడ్యూల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఒక క్యాటగిరీకి ధరణితో సం బంధం లేదని, మిగతా 11 ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని గుర్తించినట్టు సమాచారం. వచ్చేవారం కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నదని సమాచారం. తెలిసింది.
గుర్తించిన సమస్యలు
1) పేరులో మార్పులు, చేర్పులు. 2) విస్తీర్ణంలో మార్పులు. 3) సర్వే నంబర్ తొలిగింపు. 4) ఎన్వోసీ/ఓఆర్సీ/38-ఈ/13-బీ 5) సర్వే నంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం. 6) అసైన్డ్ భూములను పట్టా భూములగా మార్పు. 7) ల్యాండ్ నేచర్/ల్యాండ్ టైప్‌ను మార్చడం. 8) మిస్సింగ్ సర్వేనంబర్/కొత్త ఖాతా సృష్టించడం. 9) ఖాతాల విలీనం/ఖాతాను విభజించడం. 10) లావాదేవీని నిలిపివేయడం/ఉపసంహరించడం. 11) జాయింట్ పట్టా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

